కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం!


హైదరబాద్ సెప్టెంబర్ 10 (శుభ తెలంగాణ) : కరోన విజ్రుంబిస్తున్నా తరుణంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగ విఫలం అయిందని బీసి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ మండిపడ్డారు.. అట్టడుగు వర్గాలు , పేదలను ,ప్రైవేట్ టీచర్లను,ల లెక్చరర్ల ని,విధ్యా వాలంటీర్లని ,వలస కార్మికులని ,ఇలా చెప్పుకుంటు పోతే ఇలా ఎందరో ఉన్నారని, వీళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసా ఎలా పూట గడవా లో కే.సీ.ఆర్ చెప్పలని డిమాండ్ చేసారు. వీరందరిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల ముందే హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు కచ్చితంగా ఈసారి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జర్నలిస్ట్ ల సమస్యల పై త్వరలోనే భవిష్యత్ కార్యచరన కరోన వారియర్స్ లో ముఖ్య పాత్ర వహించినా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ లాక్ డౌన్ సమయంలో పూట గడపడం కష్టంగా మారిందని,వాళ్ళని తక్షణమే ప్రభుత్వం 1000 కోట్లు ప్రత్యేక ప్యాకేజి కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేదంటే త్వరలోనే దాదాపు 1000 మందితో అస్సెంబ్లి ముట్టడిస్తామని నికాంత్ హెచ్చరించారు.