విద్యార్థుల ఇండ్లను సందర్శించిన.. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 03, 2020

విద్యార్థుల ఇండ్లను సందర్శించిన.. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు


వికారాబాద్ జిల్లా: సెప్టెంబర్ 2 (శుభ తెలంగాణ) : పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బుధవారం నాడు ఆన్ లైన్ తరగతుల మానిటరింగ్ లో భాగంగా విద్యార్థుల ఇండ్లను సందర్శిం చారు. టి-సాట్ మరియు దూరదర్శన్ యాదగిరి ఛానెల్స్ లో తరగతుల మరియు విషయాల వారిగా వివిధ సమయాలలో ప్రసారమ య్యే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. ప్రతిరోజు క్రమం తప్ప కుండా టెలివిజన్లలో మరియు సెల్ ఫోన్లలో విద్యా కార్యక్రమాల వేళలను దృష్టిలో పెట్టుకొని ముఖ్య అంశాలను నోటుపుస్తకాలలో వ్రాసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. పాఠ్య అంశాలలో ఏవైనా సందేహాలుంటే సంబంధిత ఉపాధ్యాయులకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు కృష్ణప్రకాశ్ రెడ్డి, ద్యావరి నరేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీధర్, కిష్టప్ప పాల్గొన్నారు.