వీఆర్వో వ్యవస్థ రదైంది. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

వీఆర్వో వ్యవస్థ రదైంది.


రాజపేట (శుభ తెలంగాణ) సీఎం కేసీఆర్ నిర్ణయంతో వీఆర్వో వ్యవస్థ చరిత్రలో కలిసిపోయింది. రద్దు తర్వాత సీఎం కేసీఆర్... ఓ ఆదేశమిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారుల ( వీఆర్వో) దగ్గరున్న ఫైల్స్, రికార్డులు, పత్రాలు ఇతరత్రా అన్నీ స్వాధీనం చేసుకోవాలని కరెక్టర్లను ఆదేశాలు వెళ్లాయి. ఇందుకు రోజుల తరబడి టైమ్ ఇవ్వలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపే పనైపోవాల న్నారు. ఇందులో భాగంగా రాజపేట తహసీల్దార్ కర్యలయం లో రిపోర్టులు స్వాధీనం చేసుకున్న ఎమ్మార్వో జయమ్మ స్వాధీనం చేసు కున్న ఫైల్స్ కలెక్టర్ కు సాయంత్రం 5 గంటలకల్లా... పూర్తి వివరాల్ని ప్రభుత్వానికి రిపోర్టు ఫైళ్లు జిల్లా కలెక్టర్ కు అప్పచేపరు . సడెన్ గా వచ్చిన ఈ ఆదేశంతో... కలెక్టర్లకు టెన్షన్ పెరిగింది. ఆయా గ్రామాల్లోని వీఆర్వోల నుంచి డేటా సేకరిస్తున్నారు. చాలా మంది వీఆర్వోలు ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వాలంటే కష్టమని చెబుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్... రెవెన్యూ శాఖ పై చాలా సీరియస్ గా ఉన్నారు కొత్త రెవెన్యూ చట్టాన్ని రెడీ చేస్తున్నారు. రెవెన్యూ చటానికి సంబంధించిన ముసాయిదా బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. దీనంతటికీ కారణం రెవెన్యూ ఉద్యోగుల్లో చాలా మంది అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. వందల కోట్లు ప్రజల నుంచి లాక్కుంటూ... అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎన్నో ఉదంతాలుతెర పైకి వస్తున్నాయి. అధికారుల తీరుపై ప్రజలు భగ్గు మంటున్నారు. ఏపని కైనా డబ్బులు చేతిలో పెట్టందే ఫైల్ కదల ట్లేదు, స్టాంప్ పడట్లేదు. ఇలాగైతే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కీసర ఎమ్మార్వో ఘటన, షేక్ పేట ఎమ్మార్వో సుజాత, ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం వంటి అంశాలు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చెయ్యాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో వీఆర్వో ఓలు కీలకంగా మారారు. దాదాపు 95 రకాల విధులు వారి చేతుల్లో ఉన్నాయి. ప్రజలతో డైరెక్టుగా సంబంధం కలిగి ఉంటే... గ్రామ రెవెన్యూ అధికారుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనికీ రేటు కట్టి లంచాలు మింగుతున్నారు. ప్రజలేమో తమ తలరాత అనుకుంటూ...లంచాలు ఇస్తూ... కష్టాలపాలవుతున్నారు. అందుకే... ఈ పీడ విరగడ అవ్వాలనుకున్న ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థనే లేపేసింది. తెలంగాణలో ప్రస్తుతం 7172 మంది వీఆర్వో పోస్టులు ఉన్నాయి. దాదాపు 5 వేల మంది వీఆర్వో లుగా చేస్తున్నారు. ఇప్పుడు వారి స్థానంలో సరికొత్త వ్యవస్థ రాబోతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.