కూకట్ పల్లి అక్టోబర్ 6(శుభ తెలంగాణ)ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ కి చెందిన పలువురు కాంగ్రెస్ మహిళాలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో తెరాస పార్టీలోకి చేరరు.వీరికి తెరాస పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి మరియు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై స్వచందంగా తెరాస పార్టీ లోకి వస్తున్నారని ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని మరియు అందరూ కలిసి బంగారు తెలంగాణ ను సాధించుటలో ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ కి అండగా ఉండి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతామని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీ లోకి చేరిన మహిళలు నస్రీన్ బేగం, రజియా బేగం, అరుణ, నసీమ బేగం , హమీద , నసీమ బేగం మరియు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, దాసరి గోపి కృష్ణ , బ్రిక్ శ్రీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Tuesday, October 06, 2020
టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News