భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో. అక్టోబర్ 6(శుభతెలంగాణ)వ్యవసాయేతర ఆస్తుల లెక్కింపుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున గణన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి మున్సిపల్, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వ్యవసాయేతర లెక్కింపుపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామ పంచాయతీలలో ఉన్న వ్యవసాయేతర ఆస్తుల గణన ప్రక్రియలో ప్రతిరోజు లక్ష్యాన్ని కేటాయించి ఆ ప్రకారం గణన ప్రక్రియ నిర్వహించే విధంగా వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లాలో గణన ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరుగుతున్నప్పటికీ సమయం సమీపిస్తున్నందున మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇంటి స్థలాల క్రయవిక్రయాలు నిర్వహణలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ధరణి యాప్ లో నమోదు నమోదు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అనుదీప్, డి పి ఓ రమాకాంత్, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Tuesday, October 06, 2020
గణన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి. కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి.
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News