మంత్రులు ప్రభుత్వ విప్ తో కలిసి దుర్గం చెరువు టూరిస్టు బోటును ప్రారంభించిన కార్పొరేటర్ హమీద్ పటేల్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, October 06, 2020

మంత్రులు ప్రభుత్వ విప్ తో కలిసి దుర్గం చెరువు టూరిస్టు బోటును ప్రారంభించిన కార్పొరేటర్ హమీద్ పటేల్..శేర్లింగంపల్లి అక్టోబర్ 6 (శుభ తెలంగాణ) కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టూరిస్ట్ బోటింగ్ ను  మంత్రులు  శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, శాసన సభ్యులు  ఆరేకపూడి గాంధీతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్  హమీద్ పటేల్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.