శ్రీ బాలాజీ ఫౌండేషన్' ద్వారా భారతీయ జనతా పార్టీ యువ నాయకులు బలరాం ఆర్థిక సాయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, October 06, 2020

శ్రీ బాలాజీ ఫౌండేషన్' ద్వారా భారతీయ జనతా పార్టీ యువ నాయకులు బలరాం ఆర్థిక సాయం..

సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 6 (శుభ తెలంగాణ ) కండర క్షీణత (వికలాంగుల) వ్యాధితో బాధ పడుతున్న సభ్యుల యొక్క సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్  ని ఇస్నాపూర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం. జరిగింది వారు కండర క్షీణత వ్యాధితో బాధపడుతూ వారి చుట్టూ ఉన్నటువంటి కండర క్షీణతతో (వికలాంగుల) బాధపడుతున్న తోటి సహచరులకు సహాయం చేయడం చేస్తున్న రవి కుమార్ అన్న గారిని అభినందిస్తూ వారికి ' శ్రీ బాలాజీ ఫౌండేషన్' ద్వారా భారతీయ జనతా పార్టీ యువ నాయకులు బలరాం  ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బలరాం మాట్లాడుతూ ఈ రోజులలో అన్ని విధాలుగా ఆయురారోగ్యాలతో ఉన్నటువంటివారు ఇతరులకు  కు సేవ చేయాలంటే ఆలోచిస్తున్న తరుణంలో ఒక వికలాంగుని గా ఉన్నటువంటి రవి కుమార్ అన్న గారు తోటి వికలాంగుల గురించి ఆలోచిస్తూ వాళ్లకు మంచి చేయడానికి తనవంతు సాయంగా దాతల సహకారంతో ముందుకు వస్తున్న తరుణంలో వారిని అభినందించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం  గుర్తించి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది అదేవిధంగా ఎవరైనా  దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారికి సాయం చేసినట్లయితే  ఇటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి  సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.