సైబరాబాద్‌ ఏఆర్‌ (సాయుధ దళాలు) వార్షిక మొబిలైజేషన్‌-2021 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 19, 2021

సైబరాబాద్‌ ఏఆర్‌ (సాయుధ దళాలు) వార్షిక మొబిలైజేషన్‌-2021 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

 


సైబరాబాద్‌ ఏఆర్‌ (సాయుధ దళాలు) వార్షిక మొబిలైజేషన్‌-2021 కార్యక్రమాన్ని సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ మొబిలైజేషన్‌ కార్యక్రమం 15 రోజుల పాటు జరుగుతుంది. ఈ సిబ్బంది సివిల్‌ పోలీసులకు సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు వెళ్లని చోటకు వెళ్లి అక్కడ వారికి భోజనాన్ని అందించారు. క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తారని, వారి సేవలు అభినందనీయమని సీపీ తెలిపారు.. ఈ సందర్భంగా ఈ సిబ్బందికి మెడికోవర్‌ దవాఖాన వారి సౌజన్యంతో ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. లాఠీ డ్రిల్‌, ఫుట్‌ డ్రిల్‌, గార్డు మౌంటింగ్‌, మాబ్‌ ఆపరేషన్‌, పికెట్స్‌, బందోబస్తు డ్యూటీలు, శాంతిభద్రతల విధులు, ప్రకృతి విపత్తులు, ఎస్కార్ట్స్‌, పరీక్ష పత్రాల ఎస్కార్ట్‌, వీఐపీల భద్రత, ఇలా పలు అంశాల్లో శిక్షణ ఇస్తామని సీపీ వివరించారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, అడ్మిన్‌ ఏడీసీపీ లావణ్య, ఏడీసీపీ హెడ్‌ క్వార్టర్స్‌ మాణిక్‌రాజ్‌, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఎస్టేట్‌ అధికారి ఏసీపీ సంతోష్‌కుమార్‌, ఆర్‌ఐలు, 1653 సిబ్బంది పాల్గొన్నారు.