కాంగ్రెస్ ని తెరాస లేక్కచేయట్లే : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 10, 2021

కాంగ్రెస్ ని తెరాస లేక్కచేయట్లే : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిక్రిష్ణా నదిపై మట్టపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ హయాంలోనే రూ.50 కోట్లు మంజూరు చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దానికి అప్రోచ్ రోడ్డు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. చివరికి బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తమకు గౌరవప్రదమైన ఆహ్వానం కూడా పంపలేదని ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి కూడా పిలవడం లేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలకు ప్రోటోకాల్ పాటించడం లేదని.. ప్రోటోకాల్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు.


మరోవైపు, బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను వ్యాపారస్తుల చేతిలో పెడుతోందని మండిపడ్డారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగమే కొత్త చట్టాలు తెచ్చారని తప్పుబట్టారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి లేకుండా చేశారని భట్టి దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రెంట్ కడతానన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చి బిల్లులకు మద్దతు పలికారని విమర్శించారు.


మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని... అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు లేరని మండిపడ్డారు. గెలిచినోడు లేడని.. ఓడినోడు లేడని వీహెచ్ వ్యాఖ్యానించారు. పనిచేయాలంటే ఇన్‌చార్జ్‌లు కావాలి కదా అని మండిపడ్డారు. మంత్రులు, కలెక్టర్‌ వస్తే ఘోరావ్ చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ఎందుకు తీశారని గల్లా పట్టుకోవాలని, జైలుకు పోయినవాళ్లే లీడర్‌ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.