ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో నేడు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం మంత్రులు, కలెక్టర్లతో భేటీ కంటే ముందే జరగనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైన విషయం విదితమే. ఈ కమిటీ వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు, కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్కు నివేదిక అందించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులను రాష్ర్టానికి రప్పించేందుకు చేపట్టిన చర్యలపై సీఎంకు త్రిసభ్య కమిటీ వివరణ ఇవ్వనుంది. పీఆర్సీపై అధ్యయనం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీపై చర్చించనున్నారు.