నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 19, 2021

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకుంటారు. నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని ఆయన సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజే అత్యంత ప్రధానమైనది. ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోటుకు ఎగువన ఈ బ్యారేజీని నిర్మించారు. దీనికి మొత్తం 85 గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద గోదావరిలో నీటిమట్టం వంద అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో దాదాపు 5 నెలల విరామం తర్వాత మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నీటి తరలింపు ప్రక్రియను స్వయంగా వీక్షించనున్నారు సీఎం కేసీఆర్. సుమారు 4 గంటల పాటు అక్కడే ఉంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.