తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 09, 2021

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
 తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో కమిషన్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. ఈయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మహిళా కమిషన్‌ సభ్యులుగా షాహీన్‌ ఆఫ్రోజ్‌, గద్దల పద్మ, కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, ఉమాదేవి యాదవ్‌, రేవతీరావు బాధ్యతలు స్వీకరించారు.


చైర్‌ప‌ర్సన్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తమపై ఉంచిన గురుత బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఛైర్మన్, సభ్యులను కూడా నియమించారు.


ఇక ఏపీలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో నన్నపనేని రాజకుమారి ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా ఉండేవారు.