సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్రం ద్వారా వరి నాట్లు వేశారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోటకదిర గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం మడిలోకి దిగిన మంత్రి అరగంటపాటు యంత్రం ద్వారా వరి నాట్లను వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సాగు పనులు చేపట్టకముందే ప్రభుత్వం రైతుబంధు అందిస్తుండటంతో రైతులు మురిసిపోతున్నారన్నారు.