హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 12, 2021

హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరి

 


కరెంట్ వైర్లను చూస్తేనే భయపడతాం. కరెంట్ లేకపోయినా పట్టుకునేందుకు వెనుకాడతాం.అలాంటిది హైటెన్షన్ విద్యుత్ వైర్లను చూస్తేనే టెన్షన్ వస్తుంది. అలాంటి వైర్లను పట్టుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. మల్యాల మండలంలోని నూకపల్లిలో జగిత్యాల-కరీనంగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న 130 కేవీ కరెంట్‌ టవర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


దీంతో అక్కడున్న వారు ఈ ఘటనను చూసి షాక్ తిన్నారు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కావడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు ఓ బ్యాగును కూడా వెంట తీసుకొచ్చినట్లు గుర్తించారు. అతడు ఉరి వేసుకున్న చోట కనిపిస్తుండగా.. ఆ బ్యాగ్ కవర్ జగిత్యాల ప్రసన్న సెలక్షన్ బట్టల షాపుకు చెందిందిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు , విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు .మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.