భారీగా పెరుగుతున్న కరోన కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 06, 2021

భారీగా పెరుగుతున్న కరోన కేసులు

 


తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది. మొత్తం రికవరీలు 2,81,872 మంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4982గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1556గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఇవాళ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.