కరోన వాక్సినే వేసుకోలేకపోయనని వెల్లడించిన : మంత్రి ఈటెల - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 17, 2021

కరోన వాక్సినే వేసుకోలేకపోయనని వెల్లడించిన : మంత్రి ఈటెల

 


తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ముందుగా పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నాయి. అయితే కొందరు వ్యాక్సిన్ ‌పై అనుమాలను వ్యక్తం చేయడంతో.. వారిలోఉన్న భయాన్ని పొగెట్టేందుకు తానే తొలి టీకా వేయించుకుంటానంటూ ప్రకటించారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. అయితే, ఇవాళ దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పారిశుధ్య కార్మికురాలకు ఎస్. కృష్ణమ్మకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలి టీకా వేశారు. టీకా వేసుకున్న అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి ఈటెల అడిగి తెలుసుకున్నారు.


అయితే మంత్రి ఈటెల తొలి టీకా వేయించుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఈటల.. వ్యాక్సిన్‌ మాత్రం తీసుకోలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మొదటి వాక్సిన్ పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... తాను ఈ రోజు వ్యాక్సిన్‌ ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పుకొచ్చారు.. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేసిన ఈటల.. ప్రాణ త్యాగం కూడా చేశారన్నారు.


వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు.. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చాము.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఐసీఎంఆర్ గైడ్ లెన్స్ ప్రకారమే కరోనా బాధితులకు వైద్యం అందించామన్నారు ఈటెల. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణం అన్నారు.