ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 06, 2021

ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం

 


ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో మూడు సాల్వెంట్స్‌ డ్రమ్ములు దగ్ధమయ్యాయి. మొత్తం మూడుసార్లు పేలుళ్లు సంభవించాయని.. పేలుడుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు ఉన్నారని వెల్లడించారు. అయితే... కార్మికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.