బీజేపీలో చేరిక ..? మాజీ ఎంపీ కొండా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 10, 2021

బీజేపీలో చేరిక ..? మాజీ ఎంపీ కొండా

 కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పెట్టారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి పదే పదే మాట్లాడకపోయినా.. ట్విట్టర్‌లో మాత్రం ఆయన అభిమానులు, నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. తనకు సంబంధించిన రకరకాల విషయాల్ని ఆయన నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఓ ట్వీట్ చేశారు. తన కుమారుడు తన కోసం ప్రత్యేకంగా ఓ బైక్ తయారు చేశాడన్నారు. తన పాత తుప్పు పట్టిన బండిని సరికొత్తగా తయారు చేశాడని బండికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. త్వరలో తన నియోజకవర్గంలో బండిపై చక్కర్లు కొడతానన్నారు. దీనికి సంబంధించి తన పా జాకెట్ , బూట్లు, హెల్మెట్ కూడా ఉన్నాయన్నారు.

కొండా చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ అయిన బీజేపీలో మీరు ఎప్పుడు చేరుతున్నారంటూ ప్రశ్నించారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అతి పెద్ద పార్టీ తెలంగాణలో ఉన్న అతిపెద్ద దోపిడీ దారులపై చర్యలు తీసుకున్నప్పుడు అంటూ నెటిజన్ ప్రశ్నకు బదులిచ్చారు. ఎంపీ చేసిన ఈ ట్వీట్‌కు చాలామంది నెటిజన్లు సమాధానం ఇస్తారు. త్వరలో బండి సంజయ్ ఆ పని కూడా పూర్తి చేస్తారన్నారు. మరో నెటిజన్.. అతి త్వరలో బీజేపీ అ పని కూడా చేస్తుందన్నారు. ఇంకొకరు ఇప్పటికే జీహెచ్ఎంసీ, దుబ్బాకలో బీజేపీ పని పూర్తి చేసిందని.. త్వరలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీలో కూడా బీజేపీ సత్తా చూపిస్తుందన్నారు.