తహశీల్దార్‌ ను కర్రతో చితక్కొట్టిన రైతు.. కారణం ఏంటంటే - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 07, 2021

తహశీల్దార్‌ ను కర్రతో చితక్కొట్టిన రైతు.. కారణం ఏంటంటే

 


తాహశీల్దార్‌ ఓ వ్యక్తి దాడికి దిగాడు. కర్రతో అతనిప దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మార్వోకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో గార్లమండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గార్ల మండలం కంసలి తండాలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసే విషయంలో వివాదం తలెత్తింది. గత కొన్ని రోజులుగా ప్రకృతివనం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయింపు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఈ విషయమై అక్కడకు వెళ్లిన ఎమ్మార్వో రఫీయుద్దీన్‌పై ఓ రైతు దాడికి దిగాడు.

తమ భూమిలో ప్రకృతి వనం ఏర్పాటు చేయవద్దు అంటూ తహశీల్దార్ కు రైతు కు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో

...రైతు సామ్యా కుమారుడు ... తహశీల్దార్ రఫీ యుద్దీన్ పై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన చేయికి గాయాలయ్యాయి. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైతు సామ్యా పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తన కొడుకుకు మతిస్థిమితం సరిగా లేదని రైతు సామ్యా చెబుతున్నారు. అందుకే తెలియక కర్రతో దాడి చేశారని చెబుతున్నారు