నల్గొండలో నేటి నుంచి గొర్రెల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 16, 2021

నల్గొండలో నేటి నుంచి గొర్రెల పంపిణీ రాష్ట్రంలో 3.63 లక్షల మంది గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 28 వేల మంది గొల్లకురుమలు బంగారం, పుస్తెలు కుదువ పెట్టి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి లబ్ధి దారుల వాటాగా రూ.31,250 చొప్పున డీడీలు కట్టారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ 2018 ఫిబ్రవరిలో నిలిచి పోయింది. తర్వాత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా పంపిణీపై ప్రకటన చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 125 యూనిట్ల వరకు ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ ఆపేసింది. తాజాగా గొర్రెలిస్తామని మళ్లీ ప్రకటించింది. నల్గొండ టౌన్‌లోని బత్తాయి మార్కెట్‌లో శనివారం నుంచి పంపిణీకి రెడీ అయింది. కానీ ఆ పంపిణీ ఆ ఒక్క జిల్లా వరకే పరిమితం చేసింది. ఆ జిల్లా వరకే ఏర్పాట్లు చేసి కేవలం  254 యూనిట్లే పంచనున్నట్టు ఉత్తర్వులిచ్చింది. కేవలం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 40 వేల వరకు జనాభా ఉన్న గొల్లకురుమల ఓట్ల కోసమే పంపిణీ చేపడుతోందనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో 3.63 లక్షల మంది గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 28 వేల మంది గొల్లకురుమలు బంగారం, పుస్తెలు కుదువ పెట్టి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి లబ్ధి దారుల వాటాగా రూ.31,250 చొప్పున డీడీలు కట్టారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ 2018 ఫిబ్రవరిలో నిలిచి పోయింది. తర్వాత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా పంపిణీపై ప్రకటన చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 125 యూనిట్ల వరకు ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ ఆపేసింది. తాజాగా గొర్రెలిస్తామని మళ్లీ ప్రకటించింది. నల్గొండ టౌన్‌లోని బత్తాయి మార్కెట్‌లో శనివారం నుంచి పంపిణీకి రెడీ అయింది. కానీ ఆ పంపిణీ ఆ ఒక్క జిల్లా వరకే పరిమితం చేసింది. ఆ జిల్లా వరకే ఏర్పాట్లు చేసి కేవలం  254 యూనిట్లే పంచనున్నట్టు ఉత్తర్వులిచ్చింది. కేవలం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 40 వేల వరకు జనాభా ఉన్న గొల్లకురుమల ఓట్ల కోసమే పంపిణీ చేపడుతోందనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.