నేడే జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 07, 2021

నేడే జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం.

 


తెలంగాణ మొదటి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిమా కోహ్లీ

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చీఫ్ జస్టీస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హాజరుకానున్నారు. జస్టిస్‌ హిమా కోహ్లి గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణాస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మొనప్ప ఐలాండ్‌, ఖైరతాబాద్‌ వీవీ జంక్షన్‌, పంజాగుట్ట, రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్డును రెండు వైపులా మూసివేస్తామని ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌ కుమా ర్‌ తెలిపారు. వాహనదారులు ఈ నిర్ణీత సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని సూచించారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గేట ్ నెంబర్ మూడు నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. దిల్ కుష్ గెస్ట్ హౌస్‌లో మీడియా వాహనాలు పార్కు చేయాలి.