మహబూబ్‌నగర్ జిల్లా అంతర్జాతీయ పోటీలకు వేదిక - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 14, 2021

మహబూబ్‌నగర్ జిల్లా అంతర్జాతీయ పోటీలకు వేదిక ప్రపంచ స్థాయి అడ్వెంచర్స్‌, ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌ షో ఆధ్వర్యంలో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవింగ్‌, పారా మోటార్‌ విన్యాసాలు జరుగుతున్నాయి.     మహబూబ్‌నగర్ జిల్లా అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఎదిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్‌లో అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ 2021 పోటీలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడా ఉత్సవంలో పోటీ పడుతున్నారు. ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి.    ప్రపంచ స్థాయి అడ్వెంచర్స్‌, ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌ షో ఆధ్వర్యంలో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవింగ్‌, పారా మోటార్‌ విన్యాసాలు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఆకాశంలో మోటారు ఎయిర్ బెలూన్లను నడిపిన పైలెట్ల విన్యాసాలు ఆసక్తిని రేకెత్తించాయి. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్‌ షో, పారామోటార్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.    ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హరియాణా, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీ నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం ఆరు టాస్కుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. పోయిన సంవత్సరం సంక్రాంతికి గాలిపటాల ఉత్సవాలను కూడా ఇక్కడ నిర్వహించారు. ఈసారి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.