వికారాబాద్ కల్తి కల్లు ఘటన ... రోజు రోజుకు పెరుగుతున్న భాదితులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 11, 2021

వికారాబాద్ కల్తి కల్లు ఘటన ... రోజు రోజుకు పెరుగుతున్న భాదితులు


వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బారిన పడ్డ వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉం
ది. కల్తీ కల్లు తాగిన వారిలో ఆదివారం మరింత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అస్వస్థతకు గురైన వారిలో నోట్లో నుంచి రక్తం వస్తుండటం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పటికే వికారాబాద్‌ పట్టణంలోని నాలుగు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పడకలు కొరవడడంతో కొందరిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఇప్పటి వరకు 183 మంది అస్వస్థతకు గురికాగా, ఒకరు మృతి చెందారు. కల్లు సంఘాల మధ్య విభేదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చిట్టిగిద్ద కల్లు డిపోను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.


వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం కల్తీ కల్లు ఇద్దరు ప్రాణాల్ని బలితీసుకుంది. కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా కళ్లు తిరిగి వాంతులు, విరేచనాలతో ప్రజలు కింద పడిపోయారు. కల్లీ కల్లు తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్క శనివారమే 40 మంది కల్తీ కల్లు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కల్తీ కల్లు అమ్మిన కల్లు కాంపౌండ్‌ను అధికారులు సీజ్ చేశారు.


సంఘటన స్థలానికి చేరుకున్న వైద్యాధికారులు రెవెన్యూ సిబ్బంది ఘటనపై విచారణ చేపట్టారు. ప్రజలు అనారోగ్యం పాలవుతున్న దానిపై ఆరా తీశారు. కల్తీ కల్లు పలు గ్రామాలకు కూడా సరఫరా అయినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో జరిగిన కల్తీ కల్లు అమ్మకాలపై ఆరా తీశారు. ఇప్పటికే ములుగు జిల్లాలో వింత రోగం కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో వింత రోగం వ్యాపించింది. మొదటి రోజు జ్వరం ఆ తరువాత రెండు రోజుల్లో కడుపు ఉబ్బి చనిపోతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.