హైదరాబాద్ కి రెండు ప్రత్యెక రైళ్ళు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 06, 2021

హైదరాబాద్ కి రెండు ప్రత్యెక రైళ్ళు
 ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌-ధనపూర్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ రైళ్లు ఈ నెల 6 నుంచి మార్చి 31 వరకు ప్రతి రోజు రాకపోకలు సాగించనున్నట్టు వెల్లడించారు. సికింద్రాబాద్‌ నుంచి శ్రీకాకుళం రోడ్‌స్టేషన్‌ వరకు ఈ నెల 8నుంచి 16 వరకు (నంబర్‌ 07026) రైలు రాకపోకలు సాగిస్తుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నం.07025) 17వ తేదీ వరకు నడుస్తుంది.


వెల్లిపురం-తిరుపతి, తిరుపతి-వెల్లిపురం మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌ వరకు ప్రత్యేక రైలు ఈ నెల 12న నడుస్తుంది. ఈ నెల 9 నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు, ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు లింగంపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, ఈ నెల 11 నుంచి కాచిగూడ-విశాఖ రైలు నడువనున్నాయి.