బండి సంజయ్ కు కూల్ వార్నింగ్ ఇచ్చిన చేసిన మంత్రి ఎర్రబెల్లి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 15, 2021

బండి సంజయ్ కు కూల్ వార్నింగ్ ఇచ్చిన చేసిన మంత్రి ఎర్రబెల్లి

 


తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి మాట్లాడారు . పిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు . భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాల్లో కాదు అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం అంటూ పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేశారు మంత్రి ఎర్రబెల్లి .  బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో సంక్రాంతి పండుగ కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తున్న నేపథ్యంలో స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీలో ఉన్న నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు అంటూ వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ అధికారం కోసం ప్రజల మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ప్రజలను మోసగించే మాటలు మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి మీద ఎవరు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారికంగానే సమావేశానికి పెట్టటానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ కు సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజకీయ నాయకులు గౌరవం పెరిగేలా మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు.