తెలంగాణ రాష్ర్టంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏ తరగతి నుంచి తరగతులు నిర్వహించాలనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. తరగతులు ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న విధానంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో విద్యాసంస్థల రీఓపెన్‌పై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరీక్షల విధానంలో మార్పులపై కూడా చర్చించనున్నారు. సర్కారు అనుమతిస్తే ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే తరగతుల ప్రారంభంపై ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపింది.
Post Top Ad
Monday, January 11, 2021
విద్యాసంస్థల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..నేడే
Admin Details
Subha Telangana News