తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈ అభిప్రాయాన్ని స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారులే వ్యక్తపరుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమెరికా అధ్యక్షుడు తెంపరి ట్రంప్‌కు.. కేసీఆర్, కేటీఆర్‌కు తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. గ్రేటర్లో ఓడిన అభ్యర్థులతో కలసి కేటీఆర్ వివిధ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు బీజేపీకే అనుకూలమని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ప్రధాని మోదీ సమర్థతతోనే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. రానున్న రెండేళ్లు తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి లేదని అన్నారు. అయన వరద బాధితులకు సాయాన్ని నిలిపివేయటం దుర్మార్గమేనని అన్నారు. హైదరాబాద్‌లో ఉచిత నీరు, ఇంటి పన్ను ఎత్తివేస్తామన్నా గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ను నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో అక్రమ పొత్తు లేకుంటే గ్రేటర్ టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేయకుంటే గ్రేటర్ ఫలితాలు మరోలా ఉండేవని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డిలను గెలిపించటానికి అందరూ కలసికట్టుగా పనిచేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Post Top Ad
Monday, January 18, 2021
Admin Details
Subha Telangana News