వరంగల్‌లో కోడి పందాలు....ఐదుగురిని పోలీసులు అరెస్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 15, 2021

వరంగల్‌లో కోడి పందాలు....ఐదుగురిని పోలీసులు అరెస్టు

 


సంక్రాంతికి ప్రధానంగా అందరికి గుర్తుకు వచ్చేవి కోడి పందేలు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణలో చాలా తక్కువగా కోడి పందేలను చూడొచ్చు. అయితే, వరంగల్‌లోనూ కోడి పందేలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లాలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కోడి పందేల ఘటన హసన్‌పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.  కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్‌‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌లు బి.నందిరామ్‌, మధు తమ కానిస్టేబుళ్లతో కలిసి దాడి నిర్వహించారు. పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.3,260 సొమ్ము, వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు దేవరకొండ రాములు, దేవరకొండ భిక్షపతి, యాకూబ్‌ పాషా, ఓని సుధాకర్‌, సయ్యద్‌ మౌలాలీ అని పోలీసులు తెలిపారు.