నేరేడ్‌మెట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని అల్వాల్‌ పోలీసుల అరెస్ట్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 13, 2021

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని అల్వాల్‌ పోలీసుల అరెస్ట్‌

 


నేరేడ్‌మెట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని అల్వాల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. వెంకటాపురం ఇంద్రానగర్‌ ప్రాంతానికి చెందిన తన ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, సోమవారం అర్ధరాత్రి యాప్రాల్‌లోని మధుసూదన్‌రెడ్డిని దౌర్జన్యంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారని అతడి బంధువులు, కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఎందుకోసం అరెస్ట్‌ చేశారు..? అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ నేపథ్యంలోనే ఓ పోలీసు నిందితుడి సతీమణిని దూషించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో నిందితుడి తరఫువారు శాంతించారు. కాగా, మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా పోలీసులు రౌడీల్లా వ్యవహరించారని, దౌర్జన్యంగా తీసుకెళ్లారని, బంధువులు, స్నేహితులపై దౌర్జన్యం చేశారని స్థానికులు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న తన భర్తతో పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని మధుసూదన్‌రెడ్డి భార్య ఆరోపించారు.