బీజేపీ నేతల దృష్టి మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 18, 2021

బీజేపీ నేతల దృష్టి మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే

 హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల అనంతరం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బకొట్టేలా వ్యూహాలను రూపొందింంచుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ నేతల దృష్టి మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే నిలిచింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించి.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లో సాధించిన ఫలితాలు గాలివాటం కాదని నిరూపించుకోవాలని భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సమాయాత్తమౌతోంది. తాజాగా నిర్వహిస్తోన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కమలనాథులు. బలమైన టీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే పనిలో పడ్డారు. గెలుపే లక్ష్యంగా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.