టీమిండియా అద్భుత ప్రదర్శనతో గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా అజేయ రికార్డు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 20, 2021

టీమిండియా అద్భుత ప్రదర్శనతో గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా అజేయ రికార్డు టీమిండియా అద్భుత ప్రదర్శనతో గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా అజేయ రికార్డు బద్దలైంది.సొంత గడ్డపై గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు ఉన్న తిరుగులేని రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. మూడు దశాబ్దాల పాటు గబ్బాలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా.. తాజా టెస్టులో టీమిండియా ప్రదర్శనకు మోకరిల్లక తప్పలేదు. గతంలో హేమాహేమీ కెప్టెన్లు,ప్లేయర్లతోనే సాధ్యం కాని ఈ రికార్డును... ప్రస్తుత భారత జట్టు యువ కిశోరాలతోనే సాధించడం విశేషం. అందుకే ఈ విజయం అపూర్వమంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.   #IndvsAus చరిత్ర తిరగరాసిన ఇండియా.. మాటల్తో కాదు..బ్యాటుతో సమాధానం..! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ టీమిండియా విజయంపై ప్రశంసలు గుప్పించారు. ఈ విజయం చిరస్మరణీయం... కెప్టెన్ రహానేతో పాటు జట్టు సభ్యులకు శుభాకాంక్షలు అని కేసీఆర్ పేర్కొన్నారు. 'అద్భుతమైన గేమ్... అద్బుతమైన జట్టు.. భారత్ గర్వపడేలా చేశారు. మీ సత్తా,ధైర్యం,వెనకడుగు వేయని యాటిట్యూడ్... మొత్తంగా భారత్‌ను కొత్తగా ఆవిష్కరించారు.2021 సంవ‌త్స‌రాన్ని అద్భుతంగా ప్రారంభించారు అని కేటీఆర్ అన్నారు. చాలారోజులకు ఉత్తమ టెస్టు సిరీస్ విజయం.' అని మంత్రి కేటీఆర్ టీమిండియాను ప్రశంసించారు.  గబ్బా పిచ్‌పై ఆస్ట్రేలియాను ఢీకొట్టడం సాధారణ విషయం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి పిచ్‌పై రయ్యిమని దూసుకొచ్చే బౌన్సర్లను ఎదుర్కోవడం అంత సామాన్యమేమీ కాదంటున్నారు. అప్పుడెప్పుడో 1988లో విండీస్ జట్టుపై ఓటమే ఆస్ట్రేలియాకు గబ్బాలో చివరి ఓటమని... అప్పటి నుంచి ఇప్పటివరకూ అక్కడ కంగారూ జట్టు ఓడింది లేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.  తాజా టెస్టులో మూడు వికెట్ల తేడాతో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ (91),పుజారా(56),రిషబ్ పంత్(89) సెంచరీలతో మెరిశారు. మొత్తంగా 328 పరుగుల టార్గెట్‌ను చేధించిన టీమిండియా గబ్బాలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా ఘనవిజయంతో సిరీస్‌లో పాల్గొన్న భార‌త జ‌ట్టుకు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ 5 కోట్ల బోన‌స్ ప్రకటించడం విశేషం.