గద్వాల కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 08, 2021

గద్వాల కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

 


గద్వాల కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న ప్రచారం మరోసారి కలకలం రేపింది. కోట లోపలి పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారని ప్రచారం జరుగుతోంది. గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (ఎంఏఎల్‌డీ) గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో.. స్టూడెంట్స్ కోసం వెయింట్ హాల్ నిర్మాణం జరుగుతోంది. గత నవంబర్లో పనులు ప్రారంభించారు. పిల్లర్లు వేయడం కోసం జేసీబీతో గుంతలు తవ్వారు.


ఈ సందర్భంగా గతంలో రాతితో చేపట్టిన నిర్మాణ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. వాటితోపాటు నాలుగు పొరలుగా దిమ్మెలు సైతం బయటపడ్డాయి. వీటిని కొందరు రహస్యంగా తరలించారని ప్రచారం జరుగుతోంది. అందులో సంస్థానాధీశుల కాలం నాటి గుప్త నిధులు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.


ఈ ప్రచారం విషయమై కాలేజీ ప్రిన్సిపల్ శ్రీపతి నాయుడు స్పందిస్తూ.. తవ్వకాల్లో బయటపడింది రాతి కట్టడాలేనన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో.. కాంట్రాక్టర్ పనులు నిలిపేశారని ఆయన వివరణ ఇచ్చారు.